- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట!
ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లొకేషన్ పంపండి అని అడిగేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లొకేషన్ పంపండి అని అడిగేస్తున్నారు. అడ్రస్ చెబితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చెప్పినా వెళ్లే వరకు అడ్రస్ గుర్తు ఉండకపోవచ్చు. కానీ లోకేషన్ పంపిస్తే దాన్నే ఫాలో అవుతూ నేరుగా వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ కొంప ముంచుతున్నాయి. గమ్యాన్ని చేరుకోవడం ఏంటో కానీ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
తాజాగా ఓ జంట కూడా గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఇండోనేషియాకు చెందిన ఓ జంట కారులో వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు. ఈ క్రమంలో వారు సగం వరకు నిర్మాణం పూర్తైన ఓ బ్రిడ్జిపైకి వెళ్లారు. తెలియక ఆ దారిలో వెళ్లడంతో ఒక్కసారిగా కారు గాల్లో తేలి సినిమా స్టైల్‌లో మళ్లీ కింద ఉన్న రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గతంలో ఇండియాలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రమాదంలో గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ ఏకంగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళుతున్నప్పుడు పరిమిత వేగంగా వెళ్లడమే మంచింది.
పట్టపగలే ఆర్టీసీ బస్సు బీభత్సం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్






