- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్లుగా తాగడంతో కంట్రోల్ తప్పిన కారు.. చివరికి
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ వేగంగా డివైడర్ ను ఢీ కొట్టి ఎగిరి రోడ్డుకు అవతలవైపుకు దూసుకెళ్లాడు.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ వేగంగా డివైడర్ ను ఢీ కొట్టి ఎగిరి రోడ్డుకు అవతలవైపుకు దూసుకెళ్లాడు. ఓ రెస్టారెంట్ పక్కన కొంతమంది సరదాగా నిలుచుని మాట్లాడుతుండగా గల్లీలో నుండి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టింది. అనంతరం అవతల వైపు దూసుకెళ్లి మాట్లాడుతున్న 6గురు టెకీల పైకి వెళ్లింది. అయితే వాళ్లు వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు అదే సమయంలో రోడ్డు పై వెళుతున్న ఇద్దరు డెలివరీ బాయ్స్ సైతం కారు నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కారులో కూర్చున్న వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో తూలుతున్నట్టు కనిపిస్తున్నాడు. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. ఆ వ్యక్తి వల్ల ప్రాణాలు పోయేవని, అతడి లైసెన్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






