పడుకొని బైక్ నడిపిన పోకిరి.. హైదరాబాద్ ట్రాఫిక్‌లో డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లోనే కాదు.. పగటిపూట కూడా రద్దీగా ఉండే రహదారులపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు.

పడుకొని బైక్ నడిపిన పోకిరి.. హైదరాబాద్ ట్రాఫిక్‌లో డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లోనే కాదు.. పగటిపూట కూడా రద్దీగా ఉండే రహదారులపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. తాజాగా ఓ యువకుడు ట్రాఫిక్‌‌లో పడుకొని మరీ బైక్ నడిపిన ఘటన వైరల్‌గా మారింది. పగటిపూట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ద్విచక్ర వాహనంపై పడుకొని ప్రయాణిస్తూ డేంజరస్ స్టంట్స్ చేసిన ఆ వ్యక్తి చర్యలు తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ ఘటనను గమనించిన ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పడుకొని నడపడం ఏంటి బ్రో?

వైరల్ వీడియోలో ఆ యువకుడు ఏమాత్రం భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా బైక్ నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి విన్యాసాలు ఎప్పుడైనా ఘోర ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పడుకొని నడపడం ఏంటి బ్రో?’ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఇలాంటి డేంజరస్ స్టంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి పోకిరీలపై పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story