Naa anveshana: ఈడ్చుకొచ్చి మోకాళ్లపై నిలబెడుతా.. నా అన్వేష్‍కు ఉక్రెయిన్ మహిళా మాస్ వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-01-08 08:28:56  IST  )

హిందూ దేవలతో నా అన్వేష్ చేసిన వ్యాఖ్యల వివాదం చల్లారడం లేదు.

Naa anveshana: ఈడ్చుకొచ్చి మోకాళ్లపై నిలబెడుతా.. నా అన్వేష్‍కు ఉక్రెయిన్ మహిళా మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేష్ (Naa Anvesh) పెద్ద కాంట్రవర్సిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలపై (Hindu Gods Remarks) అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అన్వేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్‍కు ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి (Lydia Lakshmi) మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఒక్క చాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడ ఉన్నా భారత్‍కు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు.

ఎవరీ లిడియా లక్ష్మి:

ఉక్రెయిన్‍కు చెందిన లిడియా ఆంధ్ర అబ్బాయి తుమ్మలపాల వెంకట్‍ను వివాహమాడింది. సనాతన ధర్మానికి ఆకర్షితురాలై హిందూ మతాన్ని స్వీకరించింది. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. హిందూదేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా లిడియా స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ అతనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను పట్టుకొస్తానని లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. తన హెచ్చరికలతో అతడు కాంబోడియా, మలేషియా పారిపోయాడని ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చారు.

Read More..

Naa Anveshana : ఫాలోవ‌ర్స్ త‌గ్గినా, రూ.8 ల‌క్ష‌లు సంపాదించిన అన్వేష్‌

Next Story