- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naa Anveshana : ఫాలోవర్స్ తగ్గినా, రూ.8 లక్షలు సంపాదించిన అన్వేష్
ఎనిమిది రోజుల్లో 8 లక్షలు సంపాదించాను అంటూ అన్వేష్ వీడియో పెట్టాడు. ఆ ఎనిమిది లక్షలలో రెండు లక్షలు పెట్టి మలేషియాలో ఐఫోన్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ అన్వేష్ గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్య నటుడు శివాజీ, గరికపాటి హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రచ్చ రచ్చ చేశాడు అన్వేష్. దీంతో అన్వేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు హిందుత్వవాదులు. అటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా అన్వేష్ పై పోలీస్ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వివాదం చోటు చేసుకున్నప్పటికీ అన్వేష్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గరికపాటికి వార్నింగ్ అంటూ తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీంతో అన్వేష్ నిర్వహించే రెండు చానల్స్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా అన్వేష్ వెల్లడించారు.
తాను తప్పు చేశానని ఒప్పుకున్నప్పటికీ, నన్ను చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు.. అయినప్పటికీ ఎనిమిది రోజుల్లో 8 లక్షలు సంపాదించాను అంటూ అన్వేష్ వీడియో పెట్టాడు. ఆ ఎనిమిది లక్షలలో రెండు లక్షలు పెట్టి మలేషియాలో ఐఫోన్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. మిగిలిన ఆరు లక్షలను మహిళల కోసం ఖర్చు చేస్తానని వివరించాడు. ఇకపై ప్రతిరోజు మహిళలతో ప్రోగ్రాం నిర్వహించి, మిగిలిన ఆరు లక్షలు ఖర్చు చేస్తానని తెలిపాడు. దీంతో ఈ వీడియో కూడా క్షణాల్లోనే వైరల్ గా మారింది. వాస్తవంగా అన్వేష్ వివాదం నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నంలో.. అతని ఛానల్ చూడడం మొదలుపెట్టారు చాలా మంది. ఈ నేపథ్యంలోనే అన్వేష్ కు వ్యూస్ ఎక్కువగా పెరిగి, డబ్బులు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. క్లిక్
READ MORE ....






