అన్వేష్‌పై మరో సెక్షన్..! పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కరాటే కళ్యాణి

by Ramesh Naini |   (  Updated:2026-01-04 13:44:46  IST  )

మరోసారి యూట్యూబర్ అన్వేష్‌పై ఫిర్యాదు చేయాడానికి సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఆదివారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కి వచ్చారు.

అన్వేష్‌పై మరో సెక్షన్..! పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కరాటే కళ్యాణి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి యూట్యూబర్ అన్వేష్‌పై ఫిర్యాదు చేయాడానికి సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఆదివారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కి వచ్చారు. ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న యూట్యూబర్ అన్వేష్‌పై ఇప్పటికే నమోదు చేసిన ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 69A సెక్షన్‌ను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అవసరమైన డాక్యుమెంట్లను ఆమె పోలీసులకు అందజేశారు.

బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలి..

యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి కోరారు. ‘నా అన్వేషణ’ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను మూసివేయాలని, అలాగే అన్వేష్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అన్వేష్‌ను భారత్‌కు రప్పించాలి

ఇదిలా ఉండగా, అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్వేష్‌పై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మరోవైపు హిందూ సంఘాలు అన్వేష్‌ను భారత్‌కు రప్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.

READ MORE ..

ఫాలోవ‌ర్స్ త‌గ్గినా, రూ.8 ల‌క్ష‌లు సంపాదించిన అన్వేష్‌

అన్వేష్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఆ దేశంలోనూ ఫిర్యాదు

Next Story