అన్వేష్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఆ దేశంలోనూ ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ నా అన్వేష‌ణ‌పై ఇండియాలో ఇప్ప‌టికే మూడు కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఆస్ట్రేలియాలోనూ అత‌డిపై ఫిర్యాదు చేశారు.

అన్వేష్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఆ దేశంలోనూ ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ నా అన్వేష‌ణ‌పై ఇండియాలో ఇప్ప‌టికే మూడు కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఆస్ట్రేలియాలోనూ అత‌డిపై ఫిర్యాదు చేశారు. భార‌తీయ సాంప్ర‌దాయాల‌ను, హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రిచేలా అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేవారు. ఇక‌పై ఆస్ట్రేలియా రాకుండా అత‌డి వీసా ర‌ద్దు చేయాల‌ని ఇమిగ్రేష‌న్ అధికారులను కోరారు. ఇదిలా ఉంటే నా అన్వేష‌ణ యూట్యూబర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అన్వేష్ వీడియోల‌కు మిలియ‌న్స్ కొద్ది వ్యూవ్స్ వ‌స్తుంటాయి.

ప్ర‌స్తుతం తెలుగు టాప్ యూట్యూబ‌ర్ గా అన్వేష్ ఉన్నాడు. అయితే ఇటీవ‌ల హిందూ దేవుళ్ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో అన్వేష్ ఫాలోవ‌ర్ల సంఖ్య భారీగా త‌గ్గిపోయింది. నెటిజ‌న్లు అత‌డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అన్వేష్ మాత్రం తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని దేవుళ్ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌ని అంటున్నారు. కానీ స్త్రీల దుస్తుల‌పై శివాజీ, గ‌రిక‌పాటి చేసిన వ్యాఖ్య‌లను ఇప్ప‌టికీ ఖండిస్తూనే ఉన్నాన‌ని చెబుతున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టి నుండి బూతులు మాట్లాడ‌ను అని ట్రావెల్ వీడియోలు ఆపేసి ఈ ఏడాది మొత్తం సామాజిక మార్పు కోస‌మే వీడియోలు చేస్తాన‌ని చెబుతున్నాడు.

Next Story