- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమర్జెన్సీ వాహనంలో రొమాన్స్! అంబులెన్స్‌ను 'ఓయో' రూమ్‌గా మార్చేసిన యువత.. వీడియో వైరల్!
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌ను కొందరు యువకులు తమ కామకలాపాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌ను కొందరు యువకులు తమ కామకలాపాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌ను ఏకంగా ‘ఓయో రూమ్’లా వాడేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చత్తర్‌పూర్ రోడ్లపై వేగంగా వెళ్తున్న ఒక అంబులెన్స్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు కొందరు స్థానికులు గమనించారు. వాహనం అద్దాల గుండా లోపల జరుగుతున్న తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు వ్యక్తులు, ద్విచక్రవాహనాలపై ఆ అంబులెన్స్‌ను సుమారు 5 కిలోమీటర్ల మేర వెంబడించి మరీ అడ్డుకున్నారు. వాహనం తలుపులు తెరిచి చూడగా, లోపల ఇద్దరు యువకులు, ఒక యువతి అభ్యంతరకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు గమనించారు.
‘కదిలే ఓయో’ అంటూ నెటిజన్ల ఆగ్రహం
అంబులెన్స్‌ను ఆపి యువతీయువకులను పట్టుకున్న సమయంలో స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైద్య అత్యవసర సేవలకు ఉపయోగించాల్సిన వాహనాన్ని ఇలాంటి పాడుపనులకు ఎలా వాడుకుంటారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కామెంట్ సెక్షన్‌లో అయితే అంబులెన్స్‌ను కాస్తా ‘మూవింగ్ ఓయో (Moving OYO)’గా మార్చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అత్యవసర సేవలను ఇలా దుర్వినియోగం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






