- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలపు వలతో హనీట్రాప్.. కోట్లు కొల్లగొట్టిన రంగమ్మ నాయుడు ముఠా అరెస్ట్
అనంతపురం జిల్లాలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన భారీ హనీట్రాప్ ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District)లో అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన భారీ హనీట్రాప్(Honey Trap) ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సూత్రధారి అయిన రంగమ్మనాయుడు అలియాస్ చిన్నితో పాటు మరో నలుగురు మహిళలు, రాజేష్ అనే వ్యక్తిని అనంతపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్‌భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో నిందితులు ఇప్పటివరకు సుమారు 20 మందిని వలలో వేసుకుని కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు(DSP Srinivasulu) వెల్లడించారు.
వెలుగులోకి కీలక విషయాలు
పోలీసులు జరిపిన ఈ దాడిలో నిందితుల నుంచి రూ. 13 లక్షల నగదు, రెండు కత్తులు, పలు ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, బాధితులను భయపెట్టి సంతకాలు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ దందా వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు.
పోలీసులతో సంబంధాలపై లోతైన విచారణ
ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే నిందితులకు కొందరు పోలీసు అధికారులతో సంబంధాలు ఉన్నట్లు తెలుగుస్తోంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు లోతైన విచారణకు ఆదేశించారు. ఈ ముఠాకు సహకరించారనే అనుమానంతో ఇద్దరు సీఐలను వీఆర్‌కు (VR) అటాచ్ చేశారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారని, నేరస్థులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని డీఎస్పీ హెచ్చరించారు.
ఎమర్జెన్సీ వాహనంలో రొమాన్స్! అంబులెన్స్‌ను 'ఓయో' రూమ్‌గా మార్చేసిన యువత.. వీడియో వైరల్!






