- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జుట్లు పట్టుకుని దారుణంగా కొట్టుకున్న లేడీ టీచర్లు !
ప్రభుత్వ టీచర్లే... కానీ బజారున పడ్డారు. వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. అందులోనూ ఇద్దరు మహిళా టీచర్లే(Lady Teachers). స్ట

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ టీచర్లే... కానీ బజారున పడ్డారు. వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. అందులోనూ ఇద్దరు మహిళా టీచర్లే (Lady Teachers). స్టూడెంట్స్ చూస్తారన్న భయమే లేదు. ఇద్దరి మధ్య గొడవ రావడంతో.... జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే... ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) కార్గోన్ ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో.. ఈ సంఘటన జరిగింది. ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రవీణ దహియా ( Praveen Dahiya) అలాగే లైబ్రేరియన్ మధురాణి ( Madhu Rani) ఇద్దరూ కొట్టుకున్నారు. మొదట ఒకరి చెంపలపై మరొకరు కొట్టుకోగా... ఆ తర్వాత జుట్టు పట్టుకొని కూడా కొట్టుకున్నారు.
ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా వర్క్ విషయంలో విభేదాలు ఉన్నాయట. దీంతో ఆ విభేదాలు గొడవకు దారితీసాయి. వీళ్లు కొట్టుకున్న వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇద్దరు ఉద్యోగులను.. తొలగించి తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Read More..
ప్రియురాలితో గొడవ.. ఎత్తైన భవనం కిటికీ లోంచి దూకేసిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే?






