- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలితో గొడవ.. ఎత్తైన భవనం కిటికీ లోంచి దూకేసిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే?
ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమికుల (Viral) మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం. కానీ, కొన్నిసార్లు ఈ చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలా మారి, హృదయాల మధ్య అంతరాలను పెంచుతాయి. ఆ క్షణంలో వారు తీసుకునే నిర్ణయాలను కొన్నిసార్లు భయకరంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో (Social media) ఇలాంటి ఓ వీడియో వైరల్‌గా (Viral) మారింది. ప్రియురాలితో గొడవ పడుతూ.. ఓ వ్యక్తి కిటికీ లోంచి ఆమాంతం దూకేశాడు. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ దాగుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదివేయండి.
ఓ బహుళ అంతస్థుల భవనంలో ఇద్దరు లవర్స్ గొడవ పడుతున్నారు. ప్రియుడు ఎంత బతిలాడుతున్నప్పటికీ ప్రియురాలు వినకపోవడంతో.. అతడు కిటికీలోంచి దూకడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ అమ్మాయి వెంటనే స్పందించి అతడిని అడ్డుకుంది. దీంతో వెనక్కి వచ్చినట్లే వచ్చి రెండోసారి వేగంగా వెళ్లి గబుక్కున కిటికీ లోంచి కిందకి దూకేశాడు. ఇంకేముంది ప్రాణాలు గాల్లో కలిసి పోయుంటాయి.. పాపం అని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
కిటికీలోంచి దూకిన అతడు మరో చిన్న గోడపై పడ్డాడు. అనంతరం హ్యాపీగా లేచి, సైడ్ వాక్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడున్న రెండు కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్ నష్టాన్ని కూడా ఆ అబ్బాయి నుంచే వసూలు చేసింది. చైనాలోని (Chaina) యుహువా జిల్లా హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. అయితే, అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.






