- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral : బ్రా ధరిస్తేనే రండి.. లేకుంటే పోండి..! చెక్ చేసి మరీ అలా చేస్తున్న అధికారులు
Viral : బ్రా ధరిస్తేనే రండి.. లేకుంటే పోండి..! చెక్ చేసి మరీ అలా చేస్తున్న అధికారులు

దిశ, ఫీచర్స్ : ఎవరు ఏం తినాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? తమ శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి? అనేది మేజర్లు అయినప్పుడు ఇది పూర్తిగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయం కిందికే వస్తుంది. దీనిపై ఇతరుల నియంత్రణను ఎవరూ ఇష్టపడరు. ఎవరైనా పరిధిదాటి ప్రవర్తిస్తే అవతలి వ్యక్తి స్వేచ్ఛను, హక్కులను ఉల్లంఘించినవారవుతారు. స్త్రీ, పురుషులందరికీ ఇది సమానంగా వర్తి్స్తుంది. అయితే నైజీరియా దేశంలోని ఓ యూనివర్సిటీ మాత్రం అమ్మాయిలు తప్పకుండా బ్రా ధరించి మాత్రమే కాలేజీకి రావాలని, పరీక్షలకు హాజరు కావాలని నిబంధనను అమలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నది. అసలేం జరిగిందంటే..
వైరల్ సమాచారం ప్రకారం అది నైజీరియా దేశంలోని ఒగున్ రాష్ట్రంలో గల ఒలాబిసి ఒనాబంజో యూనివర్సిటీ (OOU). అయితే ఈ వర్సిటీ అధికారులు ఇటీవల ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. ఏంటంటే.. యూనివర్సిటీకి విద్యార్థినులందరూ బ్రా తప్పక ధరించాలి. బ్రా లేకుండా దుస్తులు ధరించి వస్తే తిరిగి చెక్ చేసి మరీ తిరిగి ఇంటికి పంపిస్తు్న్నారు. పరీక్షల సమయంలోనూ తప్పకుండా బ్రా ధరించే రావాలి. లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు.
ఒలాబిసి ఒనాబంజో యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ కూడా అమ్మాయిలు బ్రా ధరించి మాత్రమే రావాలనే కొత్త రూల్‌ను సమర్థించాడు. వర్సిటీలో గౌరవ ప్రదమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో భాగంగానే ఈ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది సరైంది కాదు, మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించడమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఒక విధంగా ఇది లైంగిక వేధింపుల చర్యేనని విమర్శిస్తున్నారు.
Read More : లేడీస్ అండ్ జంట్స్.. అండర్ వేర్స్ సంవత్సరాల తరబడి వాడుతున్నారా?






