- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీస్ అండ్ జంట్స్.. అండర్ వేర్స్ సంవత్సరాల తరబడి వాడుతున్నారా?
అండర్‌వేర్స్ శరీరాన్ని కవర్ చేయడమే కాదు. ప్రైవేట్ భాగాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి.

దిశ, వెబ్‌డెస్క్: అండర్‌వేర్స్ శరీరాన్ని కవర్ చేయడమే కాదు. ప్రైవేట్ భాగాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. కానీ చాలా మంది అండర్‌వేర్‌స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నాణ్యతపై శ్రద్ధ పెట్టకుండా, శుభ్రం చేయకుండా, రోజులు గడిచిన తర్వాత కూడా అదే అండర్‌వేర్‌స్‌ను మళ్లీ మళ్లీ వాడతారు. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర వస్తువుల మాదిరిగానే అండర్‌వేర్స్ కి కూడా గడువు తేదీ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికైనా అవి మారాల్సిందేనన్నది వారి వాదన. NYU స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ టియర్నో ప్రకారం.. అండర్‌వేర్స్ మీద ఎక్స్‌పైరీ డేట్ ప్రింట్ చేయకపోయినా.. వాటిని కాలం చెల్లినవిగా పరిగణించి, క్రమం తప్పకుండా మార్చాలి. వదులుగా మారినవైనా, చిరిగినవైనా, తేమ పట్టేలా ఉన్నా.. అలాంటి అండర్‌వేర్‌స్‌ను వాడకూడదు.
ఒకసారి ధరించిన అండర్‌వేర్స్ ను మంచి డిటర్జెంట్, డెటాల్ నీటితో శుభ్రంగా ఉతకాలి. అలా చేయకపోతే ప్రైవేట్ భాగాల్లో దురద, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ శుభ్రమైన అండర్‌వేర్స్ ను ధరించడం ఉత్తమం. స్త్రీల విషయానికి వస్తే.. పాత అండర్‌వేర్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (UTI) ప్రమాదాన్ని పెంచవచ్చు. ఎందుకంటే ఫాబ్రిక్ సరైన వెంటిలేషన్‌ను అందించకపోవచ్చు.
నిపుణుల సూచనల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి అండర్‌వేర్స్ ను కొత్తవిగా మార్చాలి. అవి ఎంత బాగున్నట్లు కనిపించినా.. శరీరానికి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పాత అండర్‌వేర్స్ ను వాడడం వల్ల చర్మ సమస్యలు, అలెర్జీలు రావచ్చు.
అండర్‌వేర్స్ ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వచ్చినా.. వదులుగా మారినా, రంగు మారినా అవి వాడకుండా వెంటనే మార్చాలి. వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని మంచి నాణ్యత గల అండర్‌వేర్ ను ఎంచుకుని, వాటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా, గడువు మించినవి వాడకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More : బ్రా ధరిస్తేనే రండి.. లేకుంటే పోండి..! చెక్ చేసి మరీ అలా చేస్తున్న అధికారులు






