నెట్టింట సూపర్ వీడియో వైరల్.. పీతలు ఇంత క్యూట్‌గా తింటాయా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 04:37:28  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) యుగం నడుస్తోంది.

నెట్టింట సూపర్ వీడియో వైరల్.. పీతలు ఇంత క్యూట్‌గా తింటాయా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) యుగం నడుస్తోంది. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న వింత, విచిత్ర సంఘటనలు జరిగిన క్షణాల్లో వైరల్ (Viral) అవుతున్నాయి. ఇక ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఫన్నీగా అనిపిస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal videos) నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో విశేషంగా ఆకర్శిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వావ్.. సో క్యూట్ అంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

పీతలు సాధారణంగా చనిపోయిన, జీవించి ఉన్న చేపల నుంచి బార్నాకిల్స్, మొక్కలు, నత్తలు, రొయ్యలు, పురుగులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇక ఆహారాన్ని పట్టుకోవడానికి నోటిలోకి తీసుకువెళ్లడానికి వాటి గోళ్ళను ఉపయోగిస్తాయి. ఇక వీడియోలో ఓ బుల్లి పీత (Crab) వాటర్ పోసిన బాక్స్‌లో ఉంది. దానికి ఓ ద్రాక్ష పండును (Grapes) ఆహారంగా ఇవ్వగా తన చిన్న కంచెలతో పట్టుకొని మెల్లగా తింటుంది. 'Nature is Amazing ' అనే ఎక్స్‌ (X) ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో చూసేందుకు ఎంతో ముద్దుగా ఉంది. ఆ పీత ద్రాక్ష పండును కంచెలతో చిన్న చిన్న ముక్కులుగా తుంచుకుని తినటం నెటిజన్ల విశేషంగా ఆకట్టుకుంటుంది. కేవలం 10 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఇప్పటికే మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని, లక్షలాది మంది నెటిజన్ల మన్ననలు పొందింది.

Click For Tweet..


Read More..

పాములు ఆమాంతం మింగేసిన తాబేలు.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్

Next Story