పాములు ఆమాంతం మింగేసిన తాబేలు.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 04:41:55  IST  )

తాబేలు (Tortoise).. భూమిపై, నీటిలో నివసించే ఉభయచర జీవి అని మనకు తెలుసు.

పాములు ఆమాంతం మింగేసిన తాబేలు.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తాబేలు (Tortoise).. భూమిపై, నీటిలో నివసించే ఉభయచర జీవి అని మనకు తెలుసు. అందుకే దీనిలానే దీని ఆహారపు అలావాట్లు (Food habits) కూడా అంతే భిన్నంగా ఉంటాయి. ఇవి సాధారణంగా మొక్కులు, చిన్న చిన్న కీటకాలు, చేపలు, మట్టి గడ్డలను తింటుంటాయి. కానీ, పాములను (Snakes) తినటం అనేది చాలా అరుదు. కానీ, సోషల్ మీడియాలో (Social media) ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్‌గా (Viral) మారింది. సాధారణంగా నెమ్మదిగా కదిలే, అమాయకంగా కనిపించే తాబేలు.. క్షణాల్లో మాయమయ్యే పామును ఎలా తిన్నదో ఈ వీడియోలో చూడొచ్చు.

వైరల్ అవుతున్న వీడియోలోని సమాచారం ప్రకారం.. ఓ నదిలో రాయి కింద తాబేలు దాక్కుని ఉంది. దానికి సమీపంలోని మరో రాయిపై పాము పడుకుని ఉంది. అది గమనించిన ఆకలితో ఉన్న ఆ తాబేలు దాన్ని ఎలాగైనా తినాలని భావించింది. ఆ పాముకు ఎలాంటి అనుమానం రాకుండా.. చప్పుడు చేయకుండా ఒక్కసారిగా గబుక్కున నోటితో అందుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది తాబేలులో మరో యాంగిల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Read More..

నెట్టింట సూపర్ వీడియో వైరల్.. పీతలు ఇంత క్యూట్‌గా తింటాయా?

Next Story