- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది మంగళ స్నానమా.. మొదటి రాత్రినా.. ఇంత బరితెగిస్తున్నారు ఎవర్రా మీరంతా అని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన వేడుక. ఆలాంటి పెళ్లి వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అదిరిపోయేలా జరుపుకుంటారు. ఇటీవల కాలంలో ఈ పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తమ పెళ్లి వేడుకు నూరేళ్లు గుర్తండిపోయేలా విచిత్ర పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. వధూ వరులు హల్దీ ఫంక్షన్‌ను వెరైటీగా జరుపుకున్నారు. వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. సాధారణంగా మంగళస్నానం పసుపు నీటితో చేస్తారు. అలాంటి మంగళ స్నానం వేళ వధూవరులు డీప్ లిప్ కిస్‌తో పాటు రొమాన్స్ చేసుకుంటున్నారు. అది కూడా అందరూ చూస్తుండగానే. ఇంకా పెళ్ళి కొడుకు ఒంటి మీద బట్టలు కూడా లేవు. అమ్మాయి మీద ఉన్నాయో లేవో కూడా తెలియడం లేదు.
ఇక ఈ దరిద్రాన్ని ఫొటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదికయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తుండడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంగళ స్నానం అంటారా.. మన ఖర్మ, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో, సిగ్గు సిగ్గు ఇంత బరితెగిస్తున్నారు ఎవర్రా మీరంతా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Read More..
Viral Video: రీల్ కోసం ఏంటి తల్లీ ఈ వేషాలు.. ఈ పిన్నీసు సుందరి ఏం చేసిందో తెలిస్తే షాక్..!






