- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: రీల్ కోసం ఏంటి తల్లీ ఈ వేషాలు.. ఈ పిన్నీసు సుందరి ఏం చేసిందో తెలిస్తే షాక్..!
Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయిపోవడానికి ఏది పడితే అది యువత ఫాలో అయిపోతుంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయిపోవడానికి ఏది పడితే అది యువత ఫాలో అయిపోతుంది. ఆడపిల్ల, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కావేవీ వైరల్ అవ్వడానికి అనర్హం అన్నట్లుగా పిన్నీసులతో ఓ యువతి చేస్తున్నటువంటి సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ అమ్మడు చెవి రింగులకు బదులుగా పిన్నీసులను గుచ్చి.. దానికి కంటిన్యూయేషన్ గా ఒక పిన్నిసు కింద మరొక పిన్నిసును జతపరుస్తూ వెళ్ళింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ స్టా రీల్ రూపంలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి పనులు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.సేఫ్టీ పిన్స్ ఎక్కువగా శుభ్రంగా ఉండవు అలాంటి వాటిని చర్మానికి గుచ్చుకోవడం వల్ల వాటిపై ఉండే సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని సైతం హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది ఇలాంటి ప్రయోగాలను చిత్రవిచిత్రమైన వేషాలను వేస్తున్నారు. ఇవి చూడటానికి కాస్త నవ్వు పుట్టించేలా ఉంటాయి కానీ చివరికి వీరు తమ ప్రాణాలతో చెలగాటం ఆడే స్థాయి వరకు తెచ్చుకోకూడదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైకాలజీ ప్రకారం చూసినట్లయితే కొంతమందిలో ఐడెంటిటీ క్రైసిస్ అనే రుగ్మత ఉండటం వల్ల నలుగురిలో ఫేమస్ అయ్యేందుకు ఏ పని చేసేందుకు అయినా సిద్ధమవుతుంటారు.
దాని వల్ల వారికి చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అనే స్పృహ కూడా ఉండదు. మంచి లేదా చెడు రెండిట్లో ఏదో ఒకటి జరిగి వారికి పేరు రావాలి తమను అందరూ గుర్తించాలి అని ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటి పనుల వల్ల వారితో పాటు ఎదుటివారికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక, ఇలాంటి సమస్యలు ఉన్నవారు మానసిక నిపుణులను కలిసి తమ సమస్యలను వారికి చెప్పుకొని కౌన్సెలింగ్ పొందితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read More..
Viral Video: అన్ని రంగాల్లో మాత్రమే కాదు.. స్మోకింగులో కూడా క్వీన్ లు మన లేడీసే అట..షాకింగ్ వీడియో






