- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: అన్ని రంగాల్లో మాత్రమే కాదు.. స్మోకింగులో కూడా క్వీన్ లు మన లేడీసే అట..షాకింగ్ వీడియో
Viral Video: మహిళలు పై చేయి సాధించని రంగం అంటూ ఏదీ లేదు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: మహిళలు పై చేయి సాధించని రంగం అంటూ ఏదీ లేదు. అన్ని రంగాల్లోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అంతరిక్షంలోను భారతీయ మహిళలు తమ జెండా ఎగరవేశారు. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే విచిత్రంగా ఒక చెడు అలవాటులో కూడా మహిళలు మనదేశంలో పై చేయి సాధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ పేర్కొన్నటువంటి వైరల్ వీడియోలో భారతీయ మహిళలు స్మోకింగ్ అలవాటులో పురుషులను దాటేశారని చెబుతున్నారు. ఒక సర్వేలో గత ఏడాది మహిళల్లో 6.2 శాతం మంది స్మోకింగ్ అలవాటు పెంచుకోగా, పురుషుల్లో మాత్రం ఇది 2.3 శాతంగానే ఉందని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఈ పెరుగుతున్న చెడు అలవాటు మహిళలను ఎంత ఇబ్బందికి గురి చేస్తుందో తెలుసుకోవాలని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మహిళల్లో స్మోకింగ్ అలవాటు వల్ల చాలా చెడు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా వీధిలో క్యాన్సర్ వంటి వ్యాధులకు స్మోకింగ్ కారణం అవుతుందని, దీనికి తోడు స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, నోటి క్యాన్సర్ సైతం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గర్భంతో ఉన్న స్త్రీ సిగరెట్ తాగినట్లయితే కడుపులో ఉన్న పిండానికి చాలా ప్రమాదం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి భారతదేశంలో మహిళలు సాంప్రదాయ రీత్యా కట్టుబాట్లకు లోబడి ఉంటారు. అయినప్పటికీ మహిళల్లో ఇవి స్థాయిలో స్మోకింగ్ అలవాటు పెరుగుతూ ఉండటం చాలా ప్రమాదకరమైన పరిణామం అని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అలవాటు నుంచి కచ్చితంగా బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే యోగా వంటి విద్యలను సాధన చేస్తే మంచిదని సిగరెట్ ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు బారిన పడినట్లయితే, ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని తద్వారా వారి ఆరోగ్యం దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు.
Read More..
జుట్లు పట్టుకుని దారుణంగా కొట్టుకున్న లేడీ టీచర్లు !






