రీల్స్ పిచ్చి పీక్స్... ఎక్స్‌ప్రెస్‌వేపై నాగినీ డ్యాన్స్

by Muthe.Rajitha |   (  Updated:2026-01-07 04:43:11  IST  )

రీల్స్ పిచ్చి పీక్స్.. మామూలు స్టంట్స్ కాదు బాబోయ్

రీల్స్ పిచ్చి పీక్స్... ఎక్స్‌ప్రెస్‌వేపై నాగినీ డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : యువత రీల్స్ పిచ్చిలో పడి ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా కనీస స్పృహ లేకుండా ఉంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా పరిధిలో లక్నో–కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే మీద జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గదన్ ఖేడా సమీపంలో రాత్రిపూట ఇద్దరు యువతులు హైవే మధ్యలో రోడ్డుపై పడుకుని, భోజ్‌పురి పాటలకు నాగినీ డాన్స్ చేస్తూ రీల్స్ తీశారు. ఈ ఘటనకు సంబంధించిన మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హైవే మధ్యలో ఇలా పడుకుని రీల్స్ తీయడం చాలా ప్రమాదకరమని, ఇది వారి ప్రాణాలకు మాత్రమే కాకుండా అటుగా వెళ్లే వాహనదారుల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టినట్టేనని నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. రీల్స్ పిచ్చి కోసం ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరిపై చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెల్లువెత్తాయి. కాగా ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Read More..

Viral Video: స్టోర్‌లో ఇదేం పని! మహిళపై అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

Next Story