Viral Video: స్టోర్‌లో ఇదేం పని! మహిళపై అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-01-07 04:43:57  IST  )

కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ నగరంలో ఓ మహిళపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Viral Video: స్టోర్‌లో ఇదేం పని! మహిళపై అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ నగరంలో ఓ మహిళపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. WSS షూ స్టోర్‌లో తన పిల్లలతో కలిసి బూట్లు కొనుగోలు చేస్తుండగా ఓ వ్యక్తి మహిళను అసభ్యకరంగా తాకిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు నల్లజాతీయుడని ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇప్పటివరకు అతని పూర్తి వివరాలు తెలియరాలేదని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని గుర్తించేందుకు ప్రజల సహకారం కోరుతున్నారు. నిందితుడికి సంబంధించిన ఏవైనా సమాచారం, ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్టాక్‌టన్ పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతడిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను నెటిజన్లు కోరారు. వీడియో ఇదే..

Read More..

బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. చివరకు పోలీస్ ష్టేషన్‌కు చేరిన పంచాయితీ

Next Story