బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. చివరకు పోలీస్ ష్టేషన్‌కు చేరిన పంచాయితీ

by Ramesh Naini |

బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని మహిళలు కొట్టుకున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది.

బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. చివరకు పోలీస్ ష్టేషన్‌కు చేరిన పంచాయితీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని మహిళలు కొట్టుకున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో సీటు కోసం మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అది కాస్తా జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది. ప్రయాణికుల ముందే మహిళలు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు దిగడంతో బస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది.

పోలీస్ ష్టేషన్‌కు చేరిన పంచాయితీ..

ఈ ఘటనను గమనించిన బస్సు డ్రైవర్ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి బస్సును నేరుగా సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణకు దిగిన మహిళలను మందలించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story