5ఏళ్ల కుమారుడితో పార్టీకి వెళ్లి సోయి లేకుండా తాగిన తల్లి.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-02 03:53:53  IST  )

ఓ మ‌హిళ ఫుల్లుగా తాగిన వీడియో వైర‌ల్ అవుతోంది. అయితే మ‌హిళ తాగ‌టాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు కానీ ఆమె వెంట ఐదేళ్ల చిన్న‌పిల్లాడు సైతం ఉన్నాడు. త‌న కుమారుడితో పార్టీకి వెళ్లిన మ‌హిళ సోయి లేకుండా ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద‌కు వ‌చ్చేసింది.

5ఏళ్ల కుమారుడితో పార్టీకి వెళ్లి సోయి లేకుండా తాగిన తల్లి.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది ఇండియాలోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సరం మరింత కొత్తగా కనిపించింది. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలు, యువతులు పబ్బులు, బార్ల వద్ద ఫుల్లుగా తాగి ఊగుతున్న దృష్యాలు క‌నిపించాయి. బెంగుళూరు, హైద‌రాబాద్, గురుగావ్ లాంటి న‌గ‌రాల్లో తాగి రోడ్ల‌పై ప‌డిపోయిన వీడియోలు, ఇత‌రులు ప‌ట్టుకుని వెళుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ క్ర‌మంలోనే ఓ మ‌హిళ ఫుల్లుగా తాగిన వీడియో వైర‌ల్ అవుతోంది.

అయితే మ‌హిళ తాగ‌టాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు కానీ ఆమె వెంట ఐదేళ్ల చిన్న‌పిల్లాడు సైతం ఉన్నాడు. త‌న కుమారుడితో పార్టీకి వెళ్లిన మ‌హిళ సోయి లేకుండా ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద‌కు వ‌చ్చేసింది. ఆమె నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌టం చూసి కొడుకు బోరున ఏడుస్తున్నాడు. అది చూసిన పోలీసులు ఓ ఆటో డ్రైవ‌ర్ ను ఆమెను ఇంటివ‌ద్ద దింపాల‌ని కోరారు. ఆటో డ్రైవ‌ర్ ఆమెను ఆటో ఎక్కించే ప్ర‌య‌త్నం చేయ‌గా ఆమె న‌డ‌వ‌లేని స్థితిలో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు ఆ మ‌హిళ‌పై ఫైర్ అవుతున్నారు. కొంత‌మంది త‌ల్లిగా ఉండేందుకు అన‌ర్హులు అంటూ మండిప‌డుతున్నారు.

Read More..

మద్యం మత్తులో యువత రచ్చ.. బెంగళూరులో న్యూయర్ హంగామా!

Next Story