మద్యం మత్తులో యువత రచ్చ.. బెంగళూరులో న్యూయర్ హంగామా!

by Ramesh Naini |   (  Updated:2026-01-01 09:37:50  IST  )

బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

మద్యం మత్తులో యువత రచ్చ.. బెంగళూరులో న్యూయర్ హంగామా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, వేడుకల ఉత్సాహంలో కొందరు యువకులు, యువతులు మద్యం మత్తులో పరిమితి మించి ప్రవర్తించడం కలకలం రేపింది. ముఖ్యంగా చర్చ్ స్ట్రీట్‌లోని ఒక పబ్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో తోపులాట జరిగింది. మరికొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో అతిగా మద్యం సేవించిన వారు తూలుతూ, కేకలు వేస్తూ హంగామా సృష్టించడంతో సాధారణ ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యారు.

శాంతిభద్రతలను కాపాడేందుకు బెంగళూరు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో స్పృహ కోల్పోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రత్యేక వాహనాలను, విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, పలుచోట్ల ఉల్లంఘనలు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందలాది కేసులు నమోదవగా, అసభ్యంగా ప్రవర్తించిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో న్యూయర్ హంగామా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story