- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకున్న ముగ్గురు యువతులు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో పచ్చల్ల వ్యాపారం ప్రారంభించారు. ఇన్ఫ్యూలెన్సర్లుగా ఉంటూ.. తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు ఉన్నట్లు కొనసాగించారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా (Social media)లో ఫాలోవర్స్ పెంచుకున్న ముగ్గురు యువతులు అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) పేరుతో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించారు. ఇన్ఫ్యూలెన్సర్లుగా ఉంటూ.. తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు ఉన్నట్లు కొనసాగించారు. అయితే ఇటీవల క్షణికావేశశంలో ఓ కష్టమర్ ను పచ్చళ్ల రేట్ల విషయంలో బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో యువకుడిని తిట్టినందుకు అలేఖ్య చిట్టి పికిల్స్ కు చెందిన యువతి క్షమాపణలు కూడా చెప్పింది. అయితే మరోసారి వారి బూతులకు సంబంధించిన పలు ఆడియోలు, మెసేజ్ రిప్లై లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కూడా స్పందించినట్లు.. ఓ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏఐ ఆధారిత టెక్నాలజీతో ఆ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు అది ట్రెండింగ్ లో కొనసాగుతుంది. కాగా ఆ ఏఐ వీడియోలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. నేను అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం (Alekhya Chitti Pickles controversy)పై మాట్లాడదలుచుకున్నాను. వారు తమ కస్టమర్ పట్ల వ్యవహరించిన తీరు బాధాకరం, నేను ఆ యువకుడికి అలేఖ్య చిట్టి పికిల్స్ వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే కస్టమర్ తో దురుసుగా మాట్లాడినందుకు అలేఖ్య చిట్టి పికిల్స్ ను బహిష్కరించాలని తాను ఈ సందర్భంగా పిలుపు ఇస్తున్నానని" ట్రంప్ ఆ వీడియోలో చెబుతున్నట్లు తయారు చేశారు. ఏది ఏమైనప్పటికి క్షణికావేశంలో నోరుజారినందకు ముగ్గురు యువతులు వారి భవిష్యత్తును ప్రశ్నర్థకంగా మార్చుకున్నారు. మరీ వారిపై వస్తున్న ట్రోల్స్‌కు చెక్ పెట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ యువతులు ఎలా ఉందుకెళ్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
Read More..
Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. ముగ్గురు అమ్మాయిల స్టోరీ! తాజాగా మరో ఆడియో వైరల్
అలేఖ్య చిట్టి పికిల్స్ పంచాయతీ.. మా చెల్లిదే ఆ వాయిస్.. అక్కే మెసేజ్ పెట్టింది : అక్కాచెల్లెళ్లు






