- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలేఖ్య చిట్టి పికిల్స్ పంచాయతీ.. మా చెల్లిదే ఆ వాయిస్.. అక్కే మెసేజ్ పెట్టింది : అక్కాచెల్లెళ్లు
అలేఖ్య చిట్టి పికిల్స్.. దాదాపు వారం రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో/ ఫీచర్స్ : (Alekhya Chitti Pickles) అలేఖ్య చిట్టి పికిల్స్.. దాదాపు వారం రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఎవరు ట్వీట్ వేసినా పచ్చళ్లతో సింక్ అయ్యేలా.. పికిల్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారంటే ఈ టాపిక్ ఎంత వైరల్ అయిందో అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు అలేఖ్య చిట్టి పికిల్స్‌కు అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు తిట్లు తింటున్నారు? నెటిజన్లు అందరూ కలిసి ట్రోలింగ్ చేయడానికి కారణమేంటి? తెలుసుకుందాం.
అలేఖ్య చిట్టి పికిల్స్.. వేల మంది ఫాలోవర్స్‌ను కలిగిన అక్కాచెల్లెళ్ల స్మాల్ బిజినెస్. ప్రమోషన్స్‌తోనే అటెన్షన్ క్యాచ్ చేసి.. ధరలు భారీగా ఉన్న సక్సెస్ అయింది. అయితే తాజాగా ఓ వ్యక్తి ఇలాగే పచ్చళ్లు కొందామని ఈ సిస్టర్స్‌కు మెసేజ్ పెట్టాడు. ధరలు అడిగాడు. ఏ పచ్చడికి ఎంతో వారు కూడా లిస్ట్ పెట్టారు. ఇందుకు కస్టమర్ ఇంత ఎక్కువ ధరలా అని అడగ్గా.. ‘పచ్చళ్లే కొననోడివి.. పెళ్లాంతో సంసారం ఏం చేస్తావు.. అడిగింది ఏం కొంటావ్’ అంటూ వినకూడని బూతులన్నీ తిట్టేసింది. దీంతో షాక్ అయిన సగటు కస్టమర్ బూతుల పురాణం నెట్టింట పోస్ట్ చేశాడు. అలా వాయిస్ పోస్ట్ చేశాడో లేదో ఇలా వైరల్ అయింది. అమ్మాయిలకు ఇన్ని బూతులు వస్తాయా అని షాక్ అవడం నెటిజన్ల వంతు అయింది. ఇదే కంటెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా తీసుకుని.. అలేఖ్య చిట్టి పికిల్స్‌ను విమర్శించారు. ఇలాంటి వాళ్లు వ్యాపారం చేసుకోవడం ఎందుకని తిట్టిపోశారు. దీంతో దిగొచ్చిన అక్కాచెల్లెళ్లు.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీలో క్లారిటీ కూడా కరువై.. ఒకరిపై మరొకరు చెప్పుకోవడం నెటిజన్లు షాకింగ్‌కు గురయ్యారు.
మా చెల్లిదే వాయిస్.. సుమ కంచర్ల
ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన (Suma KancharlaSuma Kancharla) సుమ కంచర్ల వివాదంపై మొదటి స్పందించింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. అందరూ తనను ట్రోల్ చేయవద్దని అభ్యర్థించారు. వైరల్ అవుతున్న ఆడియో మెసేజ్ తాను విన్నట్లు తెలిపారు. వెంటనే తన చెల్లితో ఈ వివాదంపై మాట్లాడినట్లు చెప్పారు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని, నాతో మాట్లాడ వద్దని తన చెల్లి చెప్పినట్లు వివరించింది. నాకు పెళ్లి అయింది.. నేను నా భర్తతో కలిసి ఉంటున్నా.. చాట్‌లో ఏమి జరిగిందో తనకు తెలియదని, కానీ అలా చేసి ఉంటే, తన సోదరి తప్పు చేస్తే క్షమాపణ చెప్పమని లేదా సరైనది అయితే ఆమెకు మద్దతు ఇచ్చేదానినని ఆమె తెలిపారు. ఆ వైరల్ క్లిప్ నకిలీది కాదని, అది తన చెల్లి గొంతు అని, తనది కాదని చెప్పుకొచ్చారు.
ఒకరికి మెసేజ్ పెట్టబోయి ఇంకొకరికి అక్క మెసేజ్ పెట్టింది: రమ్య కంచర్ల
అలేఖ్య సోదరి రమ్య కంచర్ల (Ramya Kancharla) మాట్లాడుతూ.. బ్యాడ్ మెసేజ్ పెట్టిన వ్యక్తికి తాము సారీ చెప్పినట్లు ఓ వీడియో విడుదల చేశారు. అయితే వారికి వేల కొద్ది మెసేజ్‌లు డిలీట్ చేస్తామని చెప్పారు. అందులో ఎక్కువగా పచ్చి బూతులు తిట్టడం వంటి మెసేజ్‌లు వస్తాయని అన్నారు. ఇలా వచ్చినప్పుడు ఆ నంబర్లను బ్లాక్ చేస్తామని అన్నారు. అయితే కొంతమంది మరింత అసభ్యకరంగా మెసేజ్ చేస్తే.. వారికి అక్క రిప్లై ఇచ్చిందని చెప్పారు. అయితే మిస్టేక్ ఎలా జరిగిందంటే.. తిట్టిన పర్సన్‌కు కాకుండా పొరపాటుగా వేరే అతనికి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. వేరే అతనికి మెసేజ్ వెళ్లిందని గ్రహించి వెంటనే తన అక్క వాయిస్ మెసేజ్ డిలీట్ చేసిందని తెలిపారు. అయితే ఆ మెసేజ్ వ్యక్తి చూసి వైరల్ చేయడం జరిగిందని తెలిపారు. వీరు క్లారిటీ ఇచ్చిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్లారిటీలో క్లారిటీ కూడా కరువైందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read More..






