Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. ముగ్గురు అమ్మాయిల స్టోరీ! తాజాగా మరో ఆడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-04-05 11:58:12  IST  )

అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు.

Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. ముగ్గురు అమ్మాయిల స్టోరీ! తాజాగా మరో ఆడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్. అంత పాపులర్‌గా నడుస్తున్న పచ్చళ్ల వ్యాపారం ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితికి దారి తీసింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే? అలేఖ్య చిట్టి పికిల్స్ వెనుక ముగ్గరు అమ్మాయిల కృషి ఉంది. చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఫారెన్‌లో కూడా వీరికి కస్టమర్ల నుంచి పచ్చళ్ల ఆర్డర్‌లు వస్తుంటాయి. వాట్సప్‌ ద్వారా ఆర్డర్లు బాగా వస్తుంటాయి. ఇంకా వీరి పచ్చళ్లు కూడా టేస్ట్‌గా ఉంటాయని పేరు రావడం.. డిమాండ్ పెరగడంతో పాటు ధరలు సైతం ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గరు అక్కా చెల్లెల్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా. దీంతో పచ్చళ్ల వ్యాపారం జోరుగా సాగింది.

ఫన్నీ కామెంట్‌తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు పాపులర్

గతంలో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఒక ఫన్నీ కామెంట్‌తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా పాపులర్ అయింది. మీ అలేఖ్య చిట్టి పికిల్స్‌లో మీ రొయ్యల పచ్చడి తినటం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది.. అనే ఓ అభిమాని పెట్టిన కామెంట్‌తో చాలా పబ్లిసిటీ వచ్చింది. దీంతో పికిల్స్ టేస్ట్ ఎలా ఉంటాయోనని తెలుసుకోవాలని చాలా మంది ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్‌కు హాయ్ అని వాట్సప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో దాదాపు రూ.530 నుంచి రూ.1660 వరకు వివిధ రేట్లు పెట్టారు. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దీంతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ అటు నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అయింది.

‘3 వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడివి, నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావ్, చీరలు ఏం కొనిస్తావ్, ముందు డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోరా’ అంటూ నోటికి వచ్చిన బూతులు అడియో మెసేజ్ పెట్టింది. ఆడియో వైరల్ కావడంతో పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఇలా పెళ్ళాం, అమ్మను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్‌పై ట్రోల్ నడిచాయి. తాజాగా మరో ఆడియోలో మహిళా కస్టమర్‌ను తిట్టినట్లు ఆడియో వైరల్ అయింది. అందులో ‘ఒసేయ్ పిచ్చి మొఖం దానా ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావ్, ఎక్కువ ధర ఉందని అంటున్నావ్ అంటే.. నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను.. నా మాట విని నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకోని బ్రతుకు’ అనే చిట్టి పికిల్స్ అడియో వైరల్ అవుతోంది. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్‌పై నెటిజన్లు బాగా ట్రోల్ చేయడంతో దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాట్సప్ అకౌంటన్‌ను డిలీట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించడం లేదు. వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. కస్టమర్లను గౌరవించాలని, ఇలా నోటిదూలతో మంచి పేరున్న బిజినెస్‌ను క్లోజ్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు.

Next Story