Shocking: డబ్బుల కోసం యూరిన్ స్టోర్ చేసి.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేసిందో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-15 08:52:31  IST  )

ప్రస్తుత కాలంలో మనిషి జీవితాన్ని డబ్బు (Money) ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే.

Shocking: డబ్బుల కోసం యూరిన్ స్టోర్ చేసి.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో మనిషి జీవితాన్ని డబ్బు (Money) ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే. అందుకే న్యాయమా, అన్యాయమా అని కూడా ఆలోచించకుండా.. సులువుగా డబ్బు సంపాదించడానికి దైనికైనా వెనకడటం లేదు. ఇక తాజాగా డబ్బుల కోసం ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Social media influencer) చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు. డబ్బులు అవసరం అయినప్పుడల్లా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి తన బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు వసూలు చేసేందట. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ పాడ్ కాస్ట్‌లో వెల్లడించింది. ఇంతకీ ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? ప్రెగ్నెంట్‌గా ఎలా నాటకం ఆడిందో ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సెజల్ రాజ్‌నాథ్ (Sejal Rajnath) ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తన బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేసేటప్పుడు గర్భం దాల్చినట్లు చెప్పింది. పలు కారణాల వల్ల అబార్షన్ చేయించుకున్నానని తెలిపింది. అయితే, ఆ సమయంలో తన యూరిన్‌ను ఒక బాటిల్‌లో స్టోర్ చేసి ఫ్రీడ్జ్‌లో నిల్వ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా, ఆ బాటిల్‌ నుంచి కొన్ని చుక్కలు తీసుకుని ప్రెగ్నెన్సీ కిట్‌లో వేసి గర్భం దాల్చనని అబార్షన్ చేయించుకునేందుకు డబ్బులు కావాలని తన బాయ్‌ఫ్రెండ్‌ను డిమాండ్ చేసేందని పేర్కొంది. ఇది విని ఆ ఇంటర్యూ హోస్ట్ కూడా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమెపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే, సెజల్ వ్యాఖ్యలను ఓ డాక్టర్ కొట్టిపారేశారు. సైన్స్ పరంగా సాధ్యం కాదని, యూరిన్ స్టోర్ చేసిన అందులోని హార్మోన్లు 24 గంటల్లో క్షీణిస్తాయని స్పష్టంచేశారు. 'దీనిపై డాక్టర్ సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్యూ గాడ్' అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. 'సమాజంలో భావోద్వేగాలకు విలువ లేకుండాపోతుంది. స్వార్థ లాభాలు మాత్రమే ముఖ్యంగా భావిస్తున్నారు' అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More..

Viral video : ఏంది భయ్యా ఇది..! ఈ యువతిలా చేయాలంటే గట్స్ ఉండాల్సిందేనట!!


Next Story