- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video : ఏంది భయ్యా ఇది..! ఈ యువతిలా చేయాలంటే గట్స్ ఉండాల్సిందేనట!!
Viral video : ఏంది భయ్యా ఇది..! ఈ యువతిలా చేయాలంటే గట్స్ ఉండాల్సిందేనట!!

దిశ, ఫీచర్స్ : ‘‘ఉయ్.. అమ్మా హాయ్ హాయ్ మైతో మరుగయ్.. ఉయ్ అమ్మా మైతో టూటుకె బిఖరు గయ్..’’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోలోని బ్యాగ్రౌండ్ సాంగ్ ఇది.. ఓ యువతి గ్లాసులో ఏదో పానీయం తాగుతుండగా అది ప్లే అవుతుంది. ఐతే మాకెందుకు అనుకోకండి బ్రో.. ఒక్కసారి వీడియో చూస్తే మీరు కూడా అడిక్ట్ అయిపోతరేమో మరి..! ఎందుకంటే ఆ ప్రస్తుతం యూట్యూబ్ షాట్స్ అండ్ ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏముంది భయ్యా అందులో అనుకుంటున్నారా? లెట్స్ గో.. ఇది చదివేసేయండి!
సోడా అంటే తెలియని వారుంటారా ఎవరైనా.. ఇందులోనూ బహు రకాలుంటాయి. గోలీ సోడా, నిమ్మకాయ సోడా, షుగర్ లెమన్ సోడా, సాల్డ్ సోడా, సుగంధి సోడా.. ఇట్లా మస్తు టైప్స్ ఉంటాయి. ఎన్నుంటే ఏంది గానీ.. గుంటూరు సిటీలోని, నల్ల కుంటలో ఉండే బ్రేవ్ సోడా (Brave Soda) మాత్రం చాలా స్పెషల్ అంటున్నారు జనాలు..! ప్రస్తుతం ఇక్కడ ఒక్కసారైనా సోడా తాగాలని జనం తెగ ఎగబడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో ఓ యువతి.. తాగడానికని గ్లాసులో సోడా తీసుకొని నోటికాడికి తీసుకుంటుండగానే.. బుస్సున పొంగుతుంది. పైగా దానికి బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా ఇక్కడ సోడా తాగాలంటే.. గట్స్ ఉండాలి భయ్యా అంటున్నారు కొందరు యూత్ పోరగాల్లు.. అయితే వైరల్ సమాచారం ప్రకారం.. ఈ వీడియో గుంటూరు సిటీలోని నల్లకుంటలో గల బ్రేవ్ షాపునకు సంబంధించినదని తెలుస్తోంది. ఇంకెందుకాలస్యం.. మీరూ చూసేయండి.






