ప్రిన్సెస్ డయానాతో లైంగిక నేరస్థుడు డేటింగ్ ? ట్రంప్ కూడా పోటీ పడ్డారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న న్యూస్..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-25 14:13:39  IST  )

వేల్స్ యువరాణి, బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య, బ్రిటీష్ మహారాణి ఎలిజెబెత్ -2 కోడలు, ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యర్రిల తల్లి.. ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రిన్సెస్ డయానాతో లైంగిక నేరస్థుడు డేటింగ్ ? ట్రంప్ కూడా పోటీ పడ్డారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: వేల్స్ యువరాణి, బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య, బ్రిటీష్ మహారాణి ఎలిజెబెత్ -2 కోడలు, ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యర్రిల తల్లి.. ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో ఒక లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ డేటింగ్ కు వెళ్లాడన్నది దాని సారాంశం.

1961 జులై 1న ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, అతని మొదటి భార్య ఫ్రాన్సిస్ రూత్ రోచేలకు పుట్టిన నాల్గవ సంతానం. 1981 ఫిబ్రవరి 24న ప్రిన్స్ చార్లెస్ తో ఎంగేజ్మెంట్, అదే ఏడాది జులై 29న లండన్ లోని సెయింట్ పాల్ కాతేద్రాల్ లో పెళ్లి జరిగింది. పెళ్లి నాటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. 1997 ఆగస్టు 31న పారిస్ లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా మరణించారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు కూడా తీసుకున్నారు.

అసలు విషయానికి వస్తే.. జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్రెండ్ గిస్లేన్ మాక్స్ వెల్ ప్రిన్సెస్ డయానా గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. డయానా ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఎప్స్టీన్ తో కలిసినట్లు తనకు తెలిసిందని ఇటీవల విడుదలైన ట్రాన్స్ క్రిప్ట్ లో ఆమె పేర్కొంది. ఆ సమావేశంలో డయానా క్లోజ్ ఫ్రెండ్ రోజా మాంక్టన్, ఆమె భర్త, రిపోర్టర్ డొమినిక్ లాసన్ ఉన్నారని తెలిపింది. రాయల్ ఫ్యామిలీకి చెందిన డయానాను ఎప్స్టీన్ తో కలిపేందుకు రోజా ట్రై చేసినట్లుగా తనకు సమాచారం ఉంది కానీ.. దానిని తాను పూర్తిగా నిర్థారించడం లేదని తెలిపింది. అయితే ఈ సంఘటన 2000 సంవత్సరంలో జరిగినట్లుగా చెప్పడంతో అది అబద్ధమని అంటున్నారు డయానా శ్రేయోభిలాషులు. 1997లోనే మరణించిన ఆమె 2000 సంవత్సరంలో డేటింగ్ చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమే అవుతాయన్నారు.

అయితే.. ఇక్కడ ట్రంప్, ఎప్స్టీన్ డయానా కోసం పోటీ పడ్డారా ? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే పత్రికా రచయిత అయిన మైఖేల్ వోల్ఫ్ డైలీ బీస్ట్.. ఇన్ సైడ్ ట్రంప్స్ హెడ్ అనే పాడ్ కాస్ట్ లో ప్రిన్సెస్ డయానాను మొదట ఎవరు దక్కించుకుంటారోనని ఎప్స్టీన్, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ జరిగిందని తెలిపారు. కానీ డయానా వీరిద్దరిలో ఎవరితోనూ సన్నిహితంగా మెలిగినట్లు ఆధారాలు లేవన్నారు. ఏదేమైనా ప్రిన్సెస్ డయానా గురించి వస్తోన్న వార్తలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

Read More..

శవాలను తవ్వి తీసి జరిపే వింత ఆచారం.. ఇండోనేషియాలో 'మనేనే' వేడుక

Next Story