- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైదీతో జైలు సూపరింటెండెంట్ ప్రేమ.. పెళ్లి : నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన జంట
ప్రేమకు కులమతాలే కాదు.. వ్యక్తుల హోదాలతో, హద్దులతో పనిలేదని మరోసారి నిరూపించిన ఘటన ఇది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించిన అరుదైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. జైలులో విధులు నిర్వహించే ఓ మహిళా అధికారి.. జీవిత ఖైదు అనుభవించి విడుదలైన మాజీ ఖైదీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సత్నా కేంద్ర కారాగారంలో సహాయ జైలు అధికారి (డిప్యూటీ జైలర్)గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్.. అదే జైలులో శిక్ష అనుభవించిన మాజీ ఖైదీ ధర్మేంద్ర అలియాస్ అభిలాష్ ను వివాహం చేసుకున్నారు. ఇటీవల లవ్ కుష్ నగర్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.
సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవించాడు. సుమారు 14 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత 2020లో విడుదలయ్యాడు. జైలులో ఉన్న కాలంలోనే ఫిరోజా ఖాతూన్‌తో పరిచయం ఏర్పడి.. అది క్రమంగా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. విడుదలైన తర్వాత వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుని.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు నిజం చేసుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఫిరోజా ఖాతూన్ ముస్లిం కుటుంబానికి చెందినవారు కాగా.. ధర్మేంద్ర హిందూ మతానికి చెందినవాడు. మత బేధాలను పక్కనబెట్టి ఇద్దరూ తమ వ్యక్తిగత నిర్ణయంతో ఒక్కటయ్యారు. అయితే ఈ వివాహానికి ఫిరోజా కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అంగీకరించలేదని సమాచారం. అయినప్పటికీ తమ నిర్ణయంపై ఇద్దరూ సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వివాహంపై స్పందించిన ఫిరోజా.. “ఇది మా వ్యక్తిగత నిర్ణయం. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది. మేము ఈ వివాహంతో ఆనందంగా ఉన్నాం” అని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రేమకథ, వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. “జైలులో మొదలైన పరిచయం.. పెళ్లి పీటల వరకు చేరింది” అంటూ నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.






