- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శృతిమించిన శృంగారం.. విలేకరి నాలుక కొరికేసిన మహిళ
ఓ జర్నలిస్టు మహిళను హోటల్‌కు తీసుకెళ్లి శృంగారంలో మునిగి తేలుతుండగా నాలుక కట్ కావడం కడప జిల్లాలో సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్ : జర్నలిజం వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరించాడో విలేకరి. ఓ ఆటోడ్రైవర్ సహకారంతో మహిళను హోటల్‌కు తీసుకెళ్లి శృంగారంలో మునిగి తేలుతుండగా నాలుక కట్ కావడం సంచలనంగా మారింది. ఇద్దరు మద్యం మత్తులో మితిమీరి వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే విలేకరి నాలుక కట్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హోటల్ సిబ్బంది, పోలీసుల ప్రాథమికంగా అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో ఓ వ్యక్తి స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తూనే విలేకరిగా పని చేస్తున్నాడు. ఆయనకు ఓ ఆటోడ్రైవర్‌లో పరియయం ఉంది. ఆ సన్నిహితంతో తన కామకోరికలు తీర్చుకోవడానికి యువతి కావాలని కోరాడు. విలేకరి కోరిక మేరకు ఆటో డ్రైవర్‌కు తనకు పరిచయం ఉన్న మహిళను తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. అక్కడ తన పలుకుబడిని ఉపయోగించి ఎలాంటి ఐడీ కార్డులు, వివరాలు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్దంగా గదిలోకి వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఈక్రమంలోనే విలేకరి, మహిళ శృంగారంలో మునిగిపోయారు. ఈ కార్యంలో భాగంగా సదరు మహిళ విలేకరి నాలుకను బలంగా కొరికేసినట్టు సమాచారం. తీవ్రగాయం కావడంతో గది మొత్తం రక్తసిక్తమైంది.
ఈ షాకింగ్ ఘటనతో భయపడ్డ విలేకరి మహిళను వదిలేసి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పరిస్థితిని గమనించిన వైద్యులు నాలుకను అతికించడం మా వల్ల కాదని 108లో కడప రిమ్స్ (RIMS)కు తరలించారు. ప్రస్తుతం సదరు విలేకరి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. నాలుకకు శస్త్ర చికిత్స చేసినందున మాట్లాడే పరిస్థితిలో లేడు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన విలేకరిని వదిలేసిన ఆటో డ్రైవర్ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి రైల్వే స్టేషన్‌లో వదిలేయడం అనుమానస్పదంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఆ మహిళ కనిపించకుండా పోయింది.
అయితే ఆమె అఘాయిత్యం నుంచి తప్పించుకోవడానికి కొరికిందా లేక శృంగార ఆవేశంలో కొరికిందా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. విలేకరి కోలుకున్న తర్వాత ఇచ్చే స్టేట్‌మెంట్ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న హరిత హోటల్ మేనేజర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.






