స్విగ్గీ డెలివరీ బాయ్ నా ఫుడ్ తినేశాడు, OTP ఆప్షన్ ఎందుకు ఇవ్వట్లేదు.. సోషల్ మీడియాలో కస్టమర్ ఆవేదన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-17 07:22:42  IST  )

ప్ర‌స్తుతం ఆన్ లైన్‌లో ఫుడ్ డెలివరీ పెట్టుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆఫీసు పనులు, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో అసలు ఆహారం వండుకునేందుకే తీరిక లేక ఆర్డర్ పెట్టుకుంటున్నారు. క్షణాల్లో వేడి వేడిగా రావడంతో పాటు కావల్సింది ఆర్డర్ పెట్టుకునే

స్విగ్గీ డెలివరీ బాయ్ నా ఫుడ్ తినేశాడు, OTP ఆప్షన్ ఎందుకు ఇవ్వట్లేదు.. సోషల్ మీడియాలో కస్టమర్ ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ఆన్ లైన్‌లో ఫుడ్ డెలివరీ పెట్టుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆఫీసు పనులు, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో అసలు ఆహారం వండుకునేందుకే తీరిక లేక ఆర్డర్ పెట్టుకుంటున్నారు. క్షణాల్లో వేడి వేడిగా రావడంతో పాటు కావల్సింది ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉండటంతో న‌గ‌రాల్లో ప్ర‌తిరోజు ల‌క్ష‌ల ఆర్డ‌ర్స్ డెలివ‌రీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌స్ట‌మ‌ర్లు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ క‌స్ట‌మ‌ర్ త‌న ఆహారాన్ని స్విగ్గీ డెలివ‌రీ బాయ్ తినేశాడు అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ పెట్టాడు.

దీని గురించి కంపెనీని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. కస్టమర్ తన పోస్టులో.. స్విగ్గీ డెలివరీ బాయ్ నా ఆహారం తినేసి.. డెలివరీ జరిగిందని పెట్టాడని పేర్కొన్నాడు. దానికి స్విగ్గీ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీకు రీప్లేస్ మెంట్ చేస్తామంటూ సమాధానం ఇచ్చింది. దీంతో కస్టమర్ తనకు అసలు ఫుడ్ రాలేదని.. రీప్లేస్ మెంట్ అంటారు ఏంటి అని మండిపడ్డాడు. అంతే కాకుండా క‌స్ట‌మ‌ర్‌కు ఫుడ్ డెలివరీ చేసినప్పుడు OPT ఆప్షన్ ఉండేలా స్విగ్గీ, జొమాటోలను ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం స్విగ్గీ, జొమాటోలకు ఫుడ్ డెలివరీ చేసినప్పుడు ఓటీపీ ఆప్షన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More..

ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్‌తో ఇదేం గలీజు పనిరా బాబు.. వెయ్యి రూపాయలుంటే ఏసీలో రాకపోయావా.. ఏందీ దరిద్రం..

Next Story