- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి మండపంలో '32 సెకన్ల ముద్దు' ముచ్చట.. వైరల్ అవుతున్న బెంగాలీ జంట వీడియో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక బెంగాలీ నూతన వధూవరుల వీడియో వైరల్‌గా మారింది. పెళ్లి మండపంలో ఈ జంట సుమారు 32 సెకన్ల పాటు ముద్దుల్లో మునిగి పోవడం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా పెళ్లి మండపం అంటే వేద మంత్రాలు, అగ్ని గుండం, బంధుమిత్రుల కోలాహలం కనిపిస్తుంది. కానీ, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఒక బెంగాలీ జంట తమ వివాహ వేడుకలో భాగంగా మండపంలోనే అందరూ చూస్తుండగా గాఢమైన ముద్దు పెట్టుకున్నారు. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, దాదాపు 32 సెకన్ల పాటు ఆ జంట ఒకరినొకరు చుట్టేసి ముద్దుల్లో మునిగిపోయారు. వైరల్ వీడియో ప్రకారం.. ఎర్రటి కుర్తాలో ఉన్న వరుడు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలంకరించుకున్న వధువు పెళ్లి మండపంలో పూల రెక్కల మధ్య కూర్చుని ఉన్నారు. వారి పక్కనే హోమం అగ్ని వెలుగుతోంది. ఒక వీడియో గ్రాఫర్ ఈ దృశ్యాన్ని షూట్ చేస్తుండగా, ఆ జంట ఏమాత్రం సంకోచించకుండా కెమెరా ముందే ముద్దు ముచ్చట కానిచ్చేశారు.
మండిపడుతున్న నెటిజన్లు..
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. కొందరు దీనిని వారి వ్యక్తిగత ఇష్టమని సమర్థిస్తుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక నెటిజన్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘అగ్ని సాక్షిగా మండపంలో ముద్దులా? ఇది అత్యంత సిగ్గుచేటు. హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన క్రతువు, అంతే తప్ప హాలీవుడ్ సినిమా సెట్ కాదు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తూ మన సంప్రదాయాలను (సంస్కృతిని) మలినం చేయకండి. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వారికి ఈ పవిత్ర కార్యం నిర్వహించే అర్హత లేదు.’ అంటూ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారంది.
నిజమా? వెబ్ సిరీస్ షూటింగా?
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడింది అనే దానిపై స్పష్టత లేదు. కొంతమంది ఇది నిజమైన పెళ్లి వీడియో అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది ఏదైనా వెబ్ సిరీస్ లేదా షార్ట్ ఫిల్మ్ కోసం తీసిన సీన్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రామాణికతపై ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.






