- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు భార్య లేదు మీరు చేసుకుంటారా? పెళ్లికోసం ఆటో డ్రైవర్ వింత ప్రకటన
పెళ్లి కోసం ఓ ఆటో డ్రైవర్ చేసిన వినూత్న ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి చేసుకోవాలి అంటే మ్యారేజ్ బ్యూరోనో లేదంటే బంధువులను సంప్రదించి అమ్మాయిని వెతికిపెట్టమనో చెబుతారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి కోసం ఓ ఆటో డ్రైవర్ చేసిన వినూత్న ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి చేసుకోవాలి అంటే మ్యారేజ్ బ్యూరోనో లేదంటే బంధువులను సంప్రదించి అమ్మాయిని వెతికిపెట్టమనో చెబుతారు. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం అలా చేయలేదు. తన ఆటో ఎక్కినవారు సంబంధాలు తీసుకువస్తారని, లేదా ఆటో ఎక్కినవారిలో ఎవరైనా పెళ్లికానివాళ్లు ఉంటే తనను పెళ్లాడతారని అనుకున్నట్టు ఉన్నాడు. దీంతో ఏకంగా ఆటోలోనే ఓ ప్రకటన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రకటన కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండటం ఆశ్చర్యకరం.
అందులో.. నాకు భార్య లేదు. భర్త లేని నిస్సహాయకులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, లేదా లివింగ్ రిలేషన్ లో ఉండాలని అనుకున్నా నన్ను సంప్రదించండి. అంటూ పేర్కొన్నారు. కింద తన ఫోన్ నంబర్ సైతం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇదేందయ్యా ఇది ఇలాంటివి ఎప్పుడూ చూడలే అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ ఈయన పెళ్లికోసం ప్రకటన ఇచ్చాడేంటి అని షాక్ అవుతున్నారు. మరికొందరు ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. అయితే పెళ్లి లేదంటే లివింగ్ అని మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడంటూ తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
నాకు 41 ఏళ్లు.. మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ






