- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ర్యాపిడో ఉద్యోగి పరిస్థితి విషమం..
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ర్యాపిడో ఉద్యోగి షేక్ అక్బర్ పాష (25) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

దిశ, సూర్యాపేట రూరల్: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ర్యాపిడో ఉద్యోగి షేక్ అక్బర్ పాష (25) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జూన్ 1వ తేదీ తెల్లవారుజామున బాషా నాయక్ తండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, అక్బర్ పాష తన పల్సర్ మోటార్ సైకిల్‌పై తిమ్మాపురం నుంచి సూర్యాపేటకు వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కుడికాలు గజ్జల వరకు తెగిపోవడంతో పాటు ముఖం, దవడ తదితర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.
విచారణతో పాటు సాంకేతిక ఆధారాల ఆధారంగా..
కింది పళ్లు కూడా విరిగిపోయాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి బంధువు షేక్ లతీఫ్ జూన్ 3న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో సాకేత్, రాఖీ డేవిడ్, సుహాస్, సాయి, అనంతుల అభిరాం గౌడ్ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. విచారణతో పాటు సాంకేతిక ఆధారాల ఆధారంగా కారు నడిపిన అనంతుల అభిరాం గౌడ్‌కు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.






