- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ దర్శన్ పర్యటనలో కాకతీయ వైభవాన్ని అధ్యయనం చేసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "తెలంగాణ దర్శన్" అధ్యయన పర్యటనలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు రెండు రోజుల పాటు కాకతీయుల చారిత్రక రాజధాని వరంగల్ నగరంలో విస్తృతంగా పర్యటించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "తెలంగాణ దర్శన్" అధ్యయన పర్యటనలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు రెండు రోజుల పాటు కాకతీయుల చారిత్రక రాజధాని వరంగల్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని పలు చారిత్రక, పర్యాటక, సామాజిక అభివృద్ధి కేంద్రాలను సందర్శించి స్థానిక పరిపాలన, ప్రజా పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై అవగాహన పొందారు. పర్యటన సందర్భంగా అధికారులు ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, వరంగల్ కోట, వెయ్యి స్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. దేశవ్యాప్తంగా ఆదర్శ సహకార సంస్థగా గుర్తింపు పొందిన ముల్కనూర్ సహకార సంఘాన్ని సందర్శించి, గ్రామీణాభివృద్ధి, సహకార వ్యవస్థల నిర్వహణపై అధ్యయనం చేశారు. ట్రైనీ అధికారులు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లను కలిసి జిల్లా పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, హనుమకొండ ఆర్‌ఐ దశరథరాం రెడ్డి, హరిత హోటల్ మేనేజర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.






