- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది తగ్గనున్న వృద్ధి వేగం
పెరుగుతున్న ముడిచమురు ధరలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఎల్‌నినో ప్రభావంతో బలహీన రుతుపవనాల వల్ల వృద్ధి నెమ్మదిస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ వేగం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. డోలట్ క్యాపిటల్, ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ అంచనాల ప్రకారం, జీడీపీ వృద్ధి సుమారు 6.5 శాతానికి పరిమితం కావచ్చు. పెరుగుతున్న ముడిచమురు ధరలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఎల్‌నినో ప్రభావంతో బలహీన రుతుపవనాల వల్ల వృద్ధి నెమ్మదిస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతి ఖర్చులు అధికంగా ఉండటంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగి వినియోగదారులపై భారం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే బలహీన రుతుపవనాలు వ్యవసాయ రంగ వృద్ధిని దెబ్బతీయడంతో పాటు గ్రామీణ డిమాండ్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే పరిస్థితి పూర్తిస్థాయిలో ప్రతికూలంగా లేదని నిపుణులు చెబుతున్నారు. 2025-26లో ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు బలంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థకు మంచి ఊపు లభించింది. సేవల రంగం 9.3 శాతం, తయారీ రంగం 10.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2026-27లో కూడా వినియోగం, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వృద్ధికి ప్రధాన ఆధారాలుగా కొనసాగవచ్చని అంచనా. అయితే ఎగుమతుల మందగించడం, పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, వ్యవసాయ రంగంపై వాతావరణ ప్రభావం వంటి అంశాలు వృద్ధి వేగాన్ని కొంత తగ్గించే అవకాశముందని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి.






