ప్రభాస్‌తో బంధంపై స్పందించిన రాషా తడానీ.. 11ఏళ్లలోనే నా కోరిక తీర్చాడంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ను ప్రభాస్ గారిని నేరుగా ప్రత్యక్షంగా కలవలేదు. కానీ ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఎంతో నిజాయితీ గల, అత్యంత ఆప్యాయత కలిగిన వ్యక్తిగా అనిపించేవారు

ప్రభాస్‌తో బంధంపై స్పందించిన రాషా తడానీ.. 11ఏళ్లలోనే నా కోరిక తీర్చాడంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే సింగర్‌గానూ ఫుల్ పాపులారిటీ రాబట్టుకున్నారు. రాషా తడాని త్వరలోనే టాలీవుడ్‌కి గ్రాండ్‌గా పరిచయం కాబోతున్నారు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. జూలై 30న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండటంతో ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాషా తడాని, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను తాను ప్రభాస్ ఫ్యాన్‌గా చెప్పుకున్న రాషా తడాని, ప్రభాస్‌ గురించి స్పందిస్తూ:"నేను ప్రభాస్ గారిని నేరుగా ప్రత్యక్షంగా కలవలేదు. కానీ ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఎంతో నిజాయితీ గల, అత్యంత ఆప్యాయత కలిగిన వ్యక్తిగా అనిపించేవారు. ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో అండగా నిలుస్తారు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఉన్న బ్లూ అనే హస్కీ కుక్కపిల్ల కావాలని కోరుకున్నాను. దాంతో ఆయన ఏమాత్రం సంకోచించకుండా ఆ కుక్కపిల్లను రెండు రోజుల పాటు నా దగ్గరకు పంపించి నా కోరిక తీర్చారు. ఆయన చూపించిన ఆ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రభాస్ చూపించిన ఆప్యాయత, ఆయన డౌన్ టు ఎర్త్ స్వభావం గురించి రాషా షేర్ చేసుకున్న ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story