సూపర్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టిన 'చెన్నై లవ్ స్టోరీ'.. ఎన్ని కోట్లు వచ్చిందో తెలుసా?

by Pulgam srinivas |

'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ప్రీమియర్స్‌ మరియు తొలి రోజుతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూలు దక్కాయి.

సూపర్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ.. ఎన్ని కోట్లు వచ్చిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూలై 23 రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించడంతో తొలి రోజు ఓపెనింగ్స్ కూడా గట్టిగానే నమోదయ్యాయి.

తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో, ఫుల్ రన్ ముగిసే నాటికి భారీ వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా చివరికి ఎలాంటి కలెక్షన్లను నమోదు చేసి, ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.




Next Story