- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాక్రోచ్ పార్టీ’ మరో కీలక నిర్ణయం.. రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ
దేశంలో విద్యార్థి, యువజన సమస్యలపై వరుస ఉద్యమాలతో వార్తల్లో నిలుస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో విద్యార్థి, యువజన సమస్యలపై వరుస ఉద్యమాలతో వార్తల్లో నిలుస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ వ్యవహారంతో పాటు వివిధ అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేసేందుకు రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించాలని కాక్రోచ్ జనతా పార్టీ తమ శ్రేణులకు సూచించింది. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు నిరసనకారులు, యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.
శాంతియుతంగా చేపట్టాలని విజ్ఞప్తి..
ఈ ర్యాలీని అత్యంత శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సీజేపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా తమ నిరసనను తెలియజేయాలని, ఎలాంటి అపశ్రుతులకు తావులేకుండా క్రమశిక్షణతో ప్రదర్శన పూర్తి చేయాలని పిలుపునిచ్చింది. ఈ ర్యాలీ ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.






