- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సర్’ పని ఒత్తిడితో టీచర్ మృతి..? ఆందోళనలో సహచరులు
ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందారు. పని ఒత్తిడే ఆమె ప్రాణాలు తీసిందని తోటి ఉపాధ్యాయులు ఆరోపిస్తుండటంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక కురుబరహళ్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శమంత కుమారి ఎం.జి (44) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బీఎల్‌ఓ విధుల వల్ల తాను భరించరాని ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, ఇలాంటి ఒత్తిడికి ఉపాధ్యాయులు బలవ్వడం ఆశ్చర్యమేమీ కాదని ఆమె గతంలో తన సహోద్యోగులకు పంపిన మెసేజ్‌లు కలకలం రేపుతున్నాయి.
ఉపాధ్యాయుల డిమాండ్
శమంత కుమారి మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇతర విధులు కేటాయించే ముందు వారి ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారుల వివరణ
ఈ ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించారు. ‘ఆమెకు మధుమేహంతో పాటు కిడ్నీ సమస్యలు ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తనకున్న ఆరోగ్య సమస్యల గురించి ఆమె మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఆ విషయం మాకు ముందే తెలిసి ఉంటే, ఆమెకు బీఎల్‌ఓ విధులు కేటాయించేవాళ్లం కాదు’ అని ఓ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు.






