33 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి: కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి

by Batti.Sumithra |

సరూర్‌నగర్ సర్కిల్‌లో నేటి వరకు 33 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కందుకూరు ఆర్డీఓ, మహేశ్వరం నియోజకవర్గ ఈఆర్‌వో ఎన్. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

33 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి: కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి
X

దిశ, చైతన్యపురి : సరూర్‌నగర్ సర్కిల్‌లో నేటి వరకు 33 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కందుకూరు ఆర్డీఓ, మహేశ్వరం నియోజకవర్గ ఈఆర్‌వో ఎన్. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సరూర్‌నగర్ సర్కిల్‌కు సంబంధించిన పోలింగ్ స్టేషన్లు 45 నుంచి 119 వరకు ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలు, కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ ప్రోగ్రెస్‌పై సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి తేదీ వరకు వేచి చూడకుండా ఓటర్లందరూ తమ తమ ఎన్యూమరేషన్ ఫారాలను నింపి వెంటనే బీఎల్‌ఓలకు అందజేయాలని కోరారు.

ఆగస్టు 3 చివరి తేదీ అని తెలిపారు. ఓటర్లకు ఫారాలను అందించడంలో, ఇచ్చిన ఫారాలను నింపించడంలో, వాటిని బీఎల్‌ఓలకు అందజేయడంలో బీఎల్‌ఏలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిఫ్టెడ్, డబుల్, డెత్ ఓటర్లను గుర్తించడంలో కూడా బీఎల్‌ఏలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ సర్కిల్ ఏఈఆర్‌వో శ్రీనివాస్, మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నరేష్, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story