- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటే చాలా అసహ్యమేసింది.. ‘ఏజెంట్’ ఫ్లాప్‌పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
సినిమా డిజాస్టర్ అయిన తర్వాత తాను ఆ చిత్రాన్ని మళ్లీ చూశానని, వెండితెరపై తనను తాను చూసుకున్నప్పుడు తీవ్ర అసహ్యం వేసిందని అఖిల్ నిజాయితీగా అంగీకరించారు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ 2023లో నటించిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో దాదాపు మూడేళ్ల పాటు విరామం తీసుకున్న అఖిల్, ఇటీవలే ‘లెనిన్’ చిత్రంతో గ్రాండ్ సక్సెస్ సాధించి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అఖిల్ ‘ఏజెంట్’ ఫ్లాప్‌పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా డిజాస్టర్ అయిన తర్వాత తాను ఆ చిత్రాన్ని మళ్లీ చూశానని, వెండితెరపై తనను తాను చూసుకున్నప్పుడు తీవ్ర అసహ్యం వేసిందని అఖిల్ నిజాయితీగా అంగీకరించారు. దాదాపు ప్రతి సన్నివేశంలోనూ అతిగా ఓవరాక్టింగ్ చేసినట్లు తనకు స్పష్టంగా అనిపించిందని వెల్లడించారు. అయితే విడుదల కంటే ముందే ఫస్ట్ కాపీ చూసుకున్న సమయంలోనే ప్రాజెక్ట్‌లో ఏదో తేడా కొట్టిందని గ్రహించానని అఖిల్ తెలిపారు. ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్స్‌లోని కొందరికి చెప్పినప్పటికీ, భారీ బడ్జెట్ కారణంగా ఎవరూ దాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఒక కథానాయకుడిగా ఆ నిర్మాత పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడిని వీలైనంత వరకు రికవరీ చేయడానికి సినిమాకు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే దాన్ని ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు.






