- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివాసీల వ్యవసాయ రహదారి ధ్వంసం.. సీఎస్పీ బస్తీలో కలకలం
గత 30 సంవత్సరాలుగా ఆదివాసీలు, గిరిజన రైతులు వినియోగిస్తున్న వ్యవసాయ రహదారిని రాజకీయ అండతో ఒకరు ధ్వంసం చేయడంతో సీఎస్‌పీ బస్తీలో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

దిశ, ఇల్లెందు: గత 30 సంవత్సరాలుగా ఆదివాసీలు, గిరిజన రైతులు వినియోగిస్తున్న వ్యవసాయ రహదారిని రాజకీయ అండతో ఒకరు ధ్వంసం చేయడంతో సీఎస్‌పీ బస్తీలో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి, తాను ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకుంటూ ఈ రహదారిని పూర్తిగా ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రహదారికి కంకర కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధి, మాజీ మండల పరిషత్ ప్రజా ప్రతినిధి అండతో ఆయన గ్రామంలో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నిస్తే "మేము ఎమ్మెల్యే అనుచరులం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ రైతులను, సామాన్య ప్రజలను బెదిరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ ఘటనతో ఆదివాసీ రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని రహదారిని పునరుద్ధరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్పీ బస్తీ మాజీ సర్పంచ్ డిమాండ్ చేశారు.






