- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవానిపేట గ్రామ శివారులో గోదాం నిర్మాణం కోసం స్థల పరిశీలన
లింగంపేట మండలంలోని భవానిపేట గ్రామ శివారులో గోదాం నిర్మాణం కోసం స్థానిక రెవెన్యూ అటవీశాఖ అధికారులు శనివారం జాయింట్ సర్వే నిర్వహించారు.

దిశ, లింగంపేట: లింగంపేట మండలంలోని భవానిపేట గ్రామ శివారులో గోదాం నిర్మాణం కోసం స్థానిక రెవెన్యూ అటవీశాఖ అధికారులు శనివారం జాయింట్ సర్వే నిర్వహించారు. గోదాం నిర్మాణం కోసం పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించడంతో స్థానిక తహసీల్దార్ సురేష్, ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ తమ సిబ్బందితో జాయింట్ సర్వే నిర్వహించారు. భవానిపేట గ్రామ శివారులోని 712 సర్వే నెంబర్‌లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం ఇరు శాఖల అధికారులు సర్వే చేపట్టారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ సురేష్‌ను అడుగగా గోదాం నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారులతో కలిసి సర్వే చేపట్టినట్లు ఆయన చెప్పారు. వీరి వెంట మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు ఉన్నారు.






