- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమన్వయంతోనే పనుల్లో వేగం, పారదర్శకత: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పనుల్లో వేగం సాధ్యమవుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.

దిశ, కొత్తగూడెం టౌన్: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి పనుల్లో వేగం సాధ్యమవుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్, నీటి పారుదల, విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర ప్రజా సమస్యలను అధికారులతో ఆయన క్షుణ్ణంగా చర్చించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోతే పనుల్లో జాప్యం జరిగి సాధారణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుధ్య లోపం లేకుండా చూడాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటి శాశ్వత పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు జి రంగ స్వామి, నందయ్య, మధుకర్, శ్రీకాంత్, రాజశేఖర్, నాగేంద్ర, శివలాల్, శ్రీనివాస్, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.






