జాపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ట్యాప్‌‌లలో తెల్లని నీళ్లు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

by Ajay Maddhiboyina |

తిరుమ‌ల‌లో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుమ‌ల జ‌పాలి ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం వ‌ద్ద కుళాయిల్లో స‌డెన్‌గా తెల్ల‌ని నీళ్లు వ‌స్తున్నాయి. నీళ్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

జాపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ట్యాప్‌‌లలో తెల్లని నీళ్లు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమ‌ల‌లో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుమ‌ల జ‌పాలి ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం వ‌ద్ద కుళాయిల్లో స‌డెన్‌గా తెల్ల‌ని నీళ్లు వ‌స్తున్నాయి. నీళ్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇది స్వామివారి మహిమేనని నమ్ముతూ వాటిని బాటిల్స్ లో పట్టుకుని తాగుతున్నారు. చూడ్డానికి నీళ్లు అచ్చం పాలలా తెల్లగా కనిపిస్తున్నాయి. అయితే రుచిలో మాత్రం ఎలాంటి తేడా లేదని భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా బాటిళ్లు క్యాన్లలో తీసుకుని వెళుతున్నారు.

మరోవైపు నీళ్లు తెల్లగా పాలలా వస్తుండటంతో టీటీడీ అధికారులు శాంపిల్స్ ను ల్యాబ్‌కు పంపి వివరణ ఇచ్చారు. అధికపీడనంతో నీటిని విడుదల చేయడం వల్ల అందులో సూక్ష్మగాలి బుడగలు కలవడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలపారు. గాలి బుడగలు పోయిన తరవాత నీళ్లు సాధారణంగా పారదర్శకంగా కనిపిస్తాయని చెప్పారు. నీరు కలుషుతం కాలేదని కేవలం భౌతిక ప్రభావమే అని స్పష్టం చేశారు. నీరు పరిశుభ్రంగా ఉన్నాయని, తాగేందుకు పూర్తిగా సురక్షితమని నిర్దారించారు.

Next Story