- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబయి నుంచి డ్రగ్స్.. హైదరాబాద్ హోటల్‌లో కాల్ గర్ల్ అరెస్ట్!
ఓ కాల్ గర్ల్ ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఈగల్ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

దిశ, సిటీ క్రైమ్ : ఓ కాల్ గర్ల్ ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఈగల్ అధికారులకు చిక్కింది. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈగల్ అధికారుల వివరాల ప్రకారం ముంబయికి చెందిన ఓ మ్యాగజైన్ ఎడిటర్ గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ పనిచేస్తున్నాడు. అతనికి డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. అతను ముంబయిలో పరిచయమైన కాల్ గర్ల్‌కు అక్కడే ఉన్న ఓ డ్రగ్స్ సరఫరాదారుడికి సంబంధించిన కాంటాక్ట్ ఇచ్చి, అతని నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకురావాలని వాట్సాప్‌లో ఆదేశించాడు.
దీంతో కాల్ గర్ల్ ముంబయి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకువచ్చి, ఇద్దరూ కలిసి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న ఈగల్ అధికారులు ఇద్దరూ ఉన్న హోటల్ గదిలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో హోటల్ గదిలో 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. డ్రగ్స్ ఎవరితో తీసుకున్నారు, హైదరాబాద్‌కు ఎలా తీసుకువచ్చారు అనే కోణంలో ఈగల్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోలీసులు విశ్లేషిస్తున్నారు.






