- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్త హత్య
వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట సమీపంలో కాంగ్రెస్ కార్యకర్త మాడ అనిల్ (23) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట సమీపంలో కాంగ్రెస్ కార్యకర్త మాడ అనిల్ (23) హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, గుర్తుతెలియని దుండగులు అనిల్‌ను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు పాత కక్షలే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వెనుక వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందన్న అంశంపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు రాజకీయ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం కూడా ఓ కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ తాజా ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






