అర్హులైన గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పించండి

by Batti.Sumithra |

అర్హులైన గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పించాలని టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.

అర్హులైన గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పించండి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : అర్హులైన గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పించాలని టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన మంత్రిని కలిసి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వారికి వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలని, అలాగే సాధారణ బదిలీలను వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ముజీబ్ హుసేనీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎం.ఎ. ముఖీమ్ తదితరులు ఉన్నారు.

Next Story